పాదాల ఎక్స్ పర్ట్ ద ఫుట్ డాక్టర్

డయాబిటిక్ పేషెంట్ల కోసం ప్రత్యేక ఆసుపత్రి

మధుమేహం అత్యంత దుర్భర పరిస్థితిని మిగులుస్తుంది.. వ్యాధి పెరిగితే కాళ్ళను తొలగించాల్సి ఉంటుంది.. అయితే ఇలాంటి సమస్య ఉన్నవారు ముందుగానే దీన్ని గుర్తించే విధంగ  ముందుగా పసికట్టేందుకు నగరంలో కొత్త ట్రీట్మెంట్ రెడీ అయింది..

శ్రీశైలంకి ప్రారంభం అయిన బోట్ జర్నీ ధర ఎంతంటే-2024

మధుమేహం సమస్య

భారతదేశంలో మ‌ధుమేహ పాదాల‌ వ్యాధి ఒక తీవ్ర ఆరోగ్య సమస్యగా ఉంది. ప్రతి సంవత్సరం మ‌ధుమేహం కార‌ణంగా దాదాపు ల‌క్ష మందికి పైగా పాదాలు తొల‌గించాల్సి వ‌స్తోంది. ప్రపంచవ్యాప్తంగా ప్రతీ 18 సెకన్లకు ఒక అవయవాన్ని మధుమేహం కారణంగా కోల్పోతున్నారు. మ‌ధుమేహం కార‌ణంగా పాదాల్లో ఏర్ప‌డే పుండ్ల‌కు చికిత్స చేస్తే.. వీటిలో 85% అస‌లు తొల‌గించాల్సిన అవ‌స‌ర‌మే ఉండదంటున్నారువైద్యులు..ద ఫుట్ డాక్ట‌ర్ ఆస్ప‌త్రి స‌మ‌గ్ర‌, నిరోద‌క‌, అధునాత‌న చికిత్సా ప‌ద్ధ‌తుల‌తో ఈ తొల‌గింపుల రేటు త‌గ్గించనున్నది.. ముంద‌స్తుగా వ్యాధి నిర్ధార‌ణ‌, అత్యాధునిక చికిత్స‌లు, నివార‌ణ ప‌ద్ధ‌తులు తెలియ‌జేయ‌డం ద్వారా ద ఫుట్ డాక్ట‌ర్ ని మార్చనుంది

పాదాల సంరక్షకణకు తొలిసారి

పాదాల సంర‌క్ష‌ణ విష‌యంలో ఆసియాలోనే తొలిసారిగా ఏఐ ఇంటిగ్రేషన్ తో ఎక్స్‌ట్రీమిటీ ఎంఆర్ఐ ఉంది. ఇది పాదం, చీలమండ పరిస్థితులపై ఖచ్చితమైన ఇమేజింగ్ ను అందిస్తుంది. దీనివ‌ల్ల‌ ఖచ్చితమైన వ్యాధినిర్ధారణ, త్వ‌ర‌గా చికిత్స సాధ్య‌మ‌వుతాయి. హైపర్బారిక్ ఆక్సిజన్ థెరపీ  మధుమేహ రోగులకు, దీర్ఘకాలంగా గాయాలు ఉన్న‌ప్పుడు కణజాల చికిత్స‌తో కాళ్ల తొలగింపులను నివారించడానికి సహాయపడుతుంది. కస్టమ్ ఆర్థోటిక్స్ 3డి స్కానింగ్, ప్రెషర్ మ్యాపింగ్ ద్వారా నొప్పిని తగ్గించి, స్థిరత్వాన్ని మెరుగుపరచడానికి డయాబెటిక్ న్యూరోపతి రోగుల కోసం ప్రత్యేకమైన ఆర్థోటిక్స్ తయారవుతాయి. కేవ‌లం మ‌ధుమేహం మాత్ర‌మే కాక‌ పాదాలకు సంబంధించిన ప‌లు స‌మ‌స్య‌ల‌కు చికిత్స చేయనున్నారు.. ఫ్లాట్ ఫీట్, ప్లాంటార్ ఫాసైటిస్, మ‌డ‌మ‌ల నొప్పులు, ఎకిలిస్ టెండినైటిస్ లాంటివి ఉంటాయి.

ద ఫుట్ డాక్టర్

ఈ స‌మ‌స్య‌ల‌ను చిన్న‌విగా తీసుకొని వాటికి చికిత్స చేయ‌క‌పోతే జీవ‌న నాణ్య‌త‌ను, న‌డ‌క తీరు పై తీవ్రంగా ప్ర‌భావితం చేస్తాయి అంటున్నారు వైద్యులు..దేశంలో తొలిసారి పాదాల‌కు ప్ర‌త్యేక ఆస్ప‌త్రి ఏర్పాటయ్యింది. ద ఫుట్ డాక్ట‌ర్ పాదాల సంర‌క్ష‌ణ స్వ‌రూపాన్నే మార్చేసేందుకు సిద్ధ‌మైంది. కిమ్స్ హాస్పిటల్స్ మరియు డా. డాక్టర్ నరేంద్రనాథ్ మేడా సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటైన ఈ ఆస్ప‌త్రి.. మ‌ధుమేహం వ‌ల్ల త‌లెత్తే పాదాల స‌మ‌స్య‌ల‌తో పాటు, పాదాల‌కు సంబంధించి త‌లెత్తే అన్నిర‌కాల స‌మ‌స్య‌లకి స‌మ‌గ్ర ప‌రిష్కారాలు చూపుతుంది.

 

అత్యాధునిక స‌దుపాయాలు, సేవ‌లు:

పాదాల సంర‌క్ష‌ణ విష‌యంలో ఈ ఆస్ప‌త్రి అత్యాధునిక టెక్నాల‌జీని ఉప‌యోగిస్తుంది. ఇక్క‌డ ఉన్న స‌దుపాయాలు ఆసియాలోనే తొలిసారిగా ఏఐ ఇంటిగ్రేషన్ తో ఎక్స్‌ట్రీమిటీ ఎంఆర్ఐ ఇది పాదం, చీలమండ పరిస్థితులపై ఖచ్చితమైన ఇమేజింగ్ ను అందిస్తుంది. దీనివ‌ల్ల‌ ఖచ్చితమైన వ్యాధినిర్ధారణ, త్వ‌ర‌గా చికిత్స సాధ్య‌మ‌వుతాయి.హైపర్బారిక్ ఆక్సిజన్ థెరపీ (హెచ్‌బీఓటీ) మధుమేహ రోగులకు, దీర్ఘకాలంగా గాయాలు ఉన్న‌ప్పుడు కణజాల చికిత్స‌తో కాళ్ల తొలగింపులను నివారించడానికి సహాయపడుతుంది.అధునాతన నడక విశ్లేషణ చికిత్స కోసం బయోమెకానికల్ అసమానతలను గుర్తించడంలో, ముందుజాగ్రత్తగా పరిష్కారం చూపడంలో సహాయపడుతుంది, ఫలితంగా కదలికను మెరుగుపరుస్తుంది మరియు సంక్లిష్టతలను నివారిస్తుంది.కస్టమ్ ఆర్థోటిక్స్ 3డి స్కానింగ్, ప్రెషర్ మ్యాపింగ్ ద్వారా నొప్పిని తగ్గించి, స్థిరత్వాన్ని మెరుగుపరచడానికి డయాబెటిక్ న్యూరోపతి రోగుల కోసం ప్రత్యేకమైన ఆర్థోటిక్స్ తయారవుతాయి.

 

భార‌త వైద్య‌రంగంలోనే ఓ మైలురాయి: డా.భాస్కరరావు, కిమ్స్ హాస్పిటల్స్ ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్

ద ఫుట్ డాక్టర్ సమగ్ర విధానం, విప్లవాత్మక సాంకేతికతతో, భారతీయ వైద్య‌రంగంలోనే ఒక పెద్ద ముంద‌డుగు వేసింది. మధుమేహ సంబంధిత పాద సమస్యలను ప‌రిష్క‌రించ‌డంతో పాటు పాదాల‌ ఆరోగ్యాన్ని ప్రోత్స‌హించ‌డం ద్వారా, ఈ ఆస్ప‌త్రి లక్షలాది జీవితాల నాణ్యతను మెరుగుపరచడానికి సిద్ధంగా ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *