హైదరాబాద్ లో గణేష్ నిమజ్జనాల సందడి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. లక్షల్లో భక్తులు వివిధ రాష్ట్రాల నుంచి గణేష్ నిమజ్జనాలను చూసేందుకు వస్తారు. వీరి కోసం ప్రభుత్వం అన్ని ఏర్పాట్లను చేస్తుంది. జిహెచ్ ఎమ్ సి, జలమండలి, విద్యుత్ శాఖ, పోలీస్ శాఖలు అన్ని సమన్వయంతో ముందుకు వెల్తున్నారు. నిమజ్జనం కోసం వచ్చే భక్తులకు ఆర్టీసీ , రైల్వే, మెట్రో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు..
Ganesh Immersion Arrangments In Hyderabad 2024-గణనాధుడి నిమజ్జనానికి ఏర్పాట్లు పూర్తి
భక్తుల కోసం జి హెచ్ ఎమ్ సి ప్రత్యేక ఏర్పాట్లు
హైదరాబాద్ లో గణేష్ నిమజ్జనానికి అన్ని శాఖలు సమన్వయంతో ముందుకెళ్తున్నాయి. ముఖ్యంగా జిహెచ్ ఎమ్ సి ఎప్పట్లాగే భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నాారు. గణనాధుల నిమజ్జనం కోసం మొత్తం 73 పాండ్స్ ను ఏర్పాటు చేసారు. అందులో 27 బెబి పాండ్స్, 24, ఫోర్టబుల్, 22 ఎస్కలేటార్ పాండ్స్ ను సిద్దం చేసారు. వీటిలో 1 అడుగు నుంచి 5 అడుగుల వినాయక విగ్రహాలను నిమజ్జనం చెయ్యనున్నారు. మరో వైపు హుస్సేన్ సాగర్, ఫాక్స్ సాగర్, బహద్దూర్ పుర, మిరాలం చెరువు, కాప్రా ఊర చెరువు తో పాటు ఇతర పెద్ద చెరువుల వద్ద నిమజ్జన ప్రక్రియకు ఏర్పాట్లు పూర్తి చేసారు. 73 పాండ్స్ లలో విద్యుత్, త్రాగునీరు శానిటేషన్, 24 గంటల పాటు ఉండేలా చర్యలు తీసుకున్నారు. దాంతో పాటుగా అవసరమైన క్రేన్స్ లను కూడా సిద్దం చేసారు. ఇటీవల కురిసిన వర్షాలకు చాలా చోట్ల రోడ్లు డ్యామేజి అవగ అలాంటి 172 రోడ్లకు సంబంధించిన పనులను పూర్తి చేసారు. 36 ట్రాన్స్ పోర్ట్, 140 స్టాటిక్ క్రేన్ లు, 295 మొబైల్ క్రెన్స 160 గణేష్ యాక్షన్ టీన్స్, 102 మినిటిప్పర్స్, 125 జే సి బి లు,308 మొబైల్ టాయిలెట్స్ ,52,270 తాత్కాలిక స్ట్రీట్ లైట్స్ ఏర్పాటు చేసారు. వచ్చే భక్తులకు అన్నపూర్ణ బోజన కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు అధికారులు చెబుతున్నారు.
Old City Metro Works Starts Soon- పట్టాలెక్కనున్న పాతబస్తీ మెట్రో
ఖైరతాబాద్ గణనాధుడి నిమజ్జన ప్రక్రియ ఇలా
మరోవైపు బడా గణేష్ నిమజ్జనానికి సంబంధించి రూట్ మ్యాప్ ను సిద్దం చేసుకున్నారు.మంగళవారం ఉదయం 6 గంటలకు శోభాయాత్ర ప్రారంభం అయి మధ్యాహ్నం 3 గంటలకు నిమజ్జనం అయ్యేలా చర్యలు తీసుకోనున్నారు. శోభాయాత్ర గా ప్రారంభం అయి సన్సెషన్ ధియేటర్ , టెలిఫోన్ భవన్, తెలుగు తల్లి ఫైఓవర్ మీదుగా క్రేన్ 4 వద్దకు చేరుకుంటుంది. అనంతరం అక్కడ వెల్డింగ్ ప్రక్రియ పూర్తి చేసి నిమజ్జనానికి గంగమ్మ ఒడిలోకి వెళ్తాడు భారీ గణపయ్య.
భక్తుల కోసం రవాణా ఏర్పాట్లు
గణేష్ నిమజ్జనాన్ని కళ్ళారా చూసేందుకు లక్షల్లో భక్తులు రానున్నారు. వీరి కోసం రవాణా ఏర్పాట్లు చేస్తున్నారు. ముఖ్యంగా మెట్రో, ఎమ్ ఎమ్ టిఎస్, ఆర్టీసీ స్పెషల్ లను ఏర్పాటు చేసింది. నిమజ్జనం జరిగే రోజు అన్ని దిశలలో చివరి రైైళ్లు తెల్లవారుజామున 1 గంటలకు బయలుదేరి 2 గంటలకు అంటే బుధవారం తెల్లడారుజామున గమ్యస్థానాలకు చేరుకుంటాయి. లక్డీకపూల్ , ఖైరతాబాద్ మెట్రో స్టేషన్లలో అదనపపు టికెట్ కౌంటర్లను ఏర్పాటు చేస్తున్నారు. ఇక ఆర్టీసీ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో దాదాపు 600 స్పెషల్ బస్సులను నడపనుంది. నగరంలోని అన్ని ప్రాంతాల నుంచి అందుబాటులో ఉండనున్నాయి ప్రత్యేక బస్సులు. స్పెషల్ ఆఫీసర్స్ పర్యవేక్షణలో గణేష్ స్పెషల్ బస్సు లు నడపనున్నటు గ్రేటర్ హైదరాబాద్ ఈడి తెలిపారు.
గణేష్ నిమజ్జనం సందర్భంగా ఎం ఎం టి ఎస్ స్పెషల్ లను నడపనుంది దక్షిణ మధ్య రైల్వే. 17,18 తేదీల్లో నిమజ్జనం సందర్భంగా నగర నలుమూలల నుంచి వివిధ ప్రాంతాలకు ఎనిమిది ఎంఎంటీఎస్ లు నడపనుంది. సికింద్రాబాద్, హైదరాబాద్, లింగంపల్లి, ఫలక్నుమాలకు ఈ ఎంఎంటీఎస్ లు భక్తులకు అందుబాటులో ఉండనున్నాయి.
భారీ బందోబస్తు ఏర్పాటు
భారీ కార్యక్రమం కావడంతో పోలీసులను కూడా అదే స్థాయిలో మోహరించారు. మూడు కమిషనరేట్ల పరిధిలో 25 వేల మంది పోలీసులను సిద్దం చేాసారు. ఎలాంటి అనుమానాస్పద వస్తువులు కనిపించిన వెంటనే అక్కడే ఉన్న పోలీలసులకు సమాచారం అందించినా లేక డయల్ 100 కి సమాచారం అందించాలని కోరుతున్నారు పోలీసులు..
Post Views: 25