పాదాల ఎక్స్ పర్ట్ ద ఫుట్ డాక్టర్

డయాబిటిక్ పేషెంట్ల కోసం ప్రత్యేక ఆసుపత్రి మధుమేహం అత్యంత దుర్భర పరిస్థితిని మిగులుస్తుంది.. వ్యాధి పెరిగితే కాళ్ళను తొలగించాల్సి ఉంటుంది.. అయితే…

శ్రీశైలంకి ప్రారంభం అయిన బోట్ జర్నీ ధర ఎంతంటే-2024

శ్రీశైలంకి ప్రారంభం అయిన బోట్ జర్నీ ధర ఎంతంటే-2024
చుట్టు పచ్చని ప్రకృతి.. అక్కడక్కడ విసిరేసినట్టు ఉండే చిన్న చిన్న పూరి గుడిసెలు.. కృష్ణమ్మ ఒడిలో అత్యంత సుందరంగా సాగే జర్నీ మరి ఇంతటి అద్బుతమయిన ట్రిప్ మనము చేస్తే ఆ ఊహే ఎంత బాగుంది అనుకుంటున్నారా మరి ఇలాంటి అవకాశం తెలంగాణా టూరిజం శాఖ కల్పిస్తోంది .. అవునా అని షాక్ అవుతున్నారా ఎక్కడ ఏంటి అని అనుకుంటున్నారా అయితే వాచ్ దిస్ స్పెషల్ స్టోరి
Srisailam River Package
కాంక్రీట్ జంగిల్ నుంచి రిలీఫ్
నిత్యం బిజీగా కాంక్రీట్ జంగల్ లో జీవిస్తున్న నగర వాసులు వీకెండ్ లో సేద తీరెందుకు ఎక్కడికైన విహారయాత్రకు వెళ్ళాలనుకుంటారు. అది కాస్త అమలయ్యే సరికి వీకెండ్ కాస్త పూర్తి అవుతుంది.ఎన్నో అధ్భుత పర్యటక ప్రదేశాలు ఉన్న మన తెలంగాణాలో ఎటు వెళ్ళాలన్న సమయం సందర్భం కలిసి రావాలి. అలాంటి సమయం సందర్భాన్ని కల్పిస్తోంది తెలంగాణా టూరిజం శాఖ. ప్రస్తుతానికి ఒక రోజు షార్ట్ అండ్ బిగ్ ఎంటర్ టైన్ ట్రిప్ ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఒక రోజులో ఏం ఎంజాయ్ చేస్తామనుకుంటున్నారా అయితే మీరు పొరపడినట్లే ఈ పొల్యుషన్ సిటికి దూరంగా ఈ ట్రిప్ ను ఒక్కసారి ట్రై చేస్తే టెన్షన్ రిలీఫ్ ఉంటుంది.. త్వరలో రెండు రోజుల ట్రిప్ ను కూడా తెలంగాణా టూరిజం ప్రవేశపెట్టనుంది.

ధర ఎంతంటే

తెలంగాణా టూరిజం ప్రస్తుతానికి రివర్ ప్యాకేజీలను పర్యాటకుల కోసం అందుబాటులోకి తీసుకువచ్చింది. నాగార్జున సాగర్ నుంచి శ్రీశైలం కి , సోమశిల నుంచి శ్రీశైలం కి బోట్ ద్వారా ప్రత్యేక టూర్లను ప్లాన్ చేసింది . వాస్తవానికి శ్రీశైలం లో తెలంగాణా టూరిజం కు రూములు కేటయించకపోవడంతో ప్రస్తుతం ఈ రూట్లలో కేవలం నాగార్జున సాగర్, సోమశిలల నుంచి టూర్ ఆపరేట్ చేస్తోంది తెలంగాణా. ఒక్క రోజు టూర్ కి 2000 రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు. అప్ అండ్ డౌన్ కలిపి తీసుకునే పర్యాటకులకు 3000 ఛార్జ్ చేస్తున్నారు. నాగార్జున సాగర్ నుంచి ఉదయం 9 గంటలకు బయలుదేరి శ్రీశైలం 4 గంటలకు చేరుకుంటుంది. నాగార్జున సాగర్ కు వెల్లే వాళ్ళు ఈగల పెంట వద్దకు చేరుకుని అక్కడ నించి శ్రీశైలం కు చేరుకుంటారు. వచ్చే నెల నుంచి నేరుగా హైదరాబాద్ నుంచి రోడ్ కమ్ రివర్ రెండు రోజుల ప్యాకెజిని పర్యాటకుల కోసం అందుబాటులోకి తీసుకురానున్నారు..

ఇంకుడు గుంతలు లేకుంటేే వాటర్ ట్యాంకర్ బంద్ -2024

అద్భుతమైన జర్నీ

ఇక సోమశిల లేదా నాగార్జున సాగర్ నుంచి శ్రీశైలం వరకు బోట్ జర్నీ ఎలా ఉంటుంది.  హైదరాబాద్ సోమశిల లేదా నాగార్జున సాగర్ కు చేరుకోవడానికి 4 గంటల సమయం పడుతుంది. సోమశిల వద్ద టూరిజం కు సంబంధించిన కాటేజిలతో పాటు ప్రయివేట్ కాటేజ్ లు కూడా అందుబాటులో ఉంటాయి. 11 గంటలకు సోమశిల నుంచి 80 మందితో కూడిన బోట్ కృష్ణమ్మ ఒడిలోకి మెల్లగా జారుకుంది. ప్రతి శనివారం ఈ ట్రిప్ ను ఏర్పాటు చేసారు. గత ఏడాది కృష్ణా నదిలో నీళ్ళు తక్కువ ఉండటంతో బోటు ప్రయాణాన్ని రద్దు చేశారు. ఇపుడు కృష్ణా నదిలోకి భారీగా వరద నీరు చేరడంతో మళ్లీ ఈ ట్రిప్ ను ప్రారంభించారు అధికారులు..

ఆద్యాంతం ఆహ్లాదకరంగా బోటు ప్రయాణం

కృష్ణా నదిలో బోటు ప్రయాణం మరచిపోలేనిది. నిత్యం కారులో బస్సుల్లో ప్రయాణించే నగరవాసులకు ఈ బోట్ జర్నీ నిజంగా స్వీట్ మెమొరీస్ ను మిగులుస్తుంది. ఎందుకంటే మనం ప్రయాణించేది అరగంటో, గంటో కాదు ఏకంగా 6గంటల పాటు ప్రయాణం చెయ్యాల్సి ఉంటుంది.. సోమశిల నుంచి శ్రీశైలం డ్యామ్ వద్దకు చేరుకోడానికి 120కిలోమీటర్లు ప్రయాణం చెయ్యాల్సి ఉంటుంది. లాహిరి లాహిరి అంటు ప్రయాణికులు బోటింగ్ ను ఎంజాయ్ చెయ్యొచ్చు. సాధారణంగా వాటర్ టూరిజం అనగానే ముందుగా గుర్తుకు వచ్చేది పాపికొండలు.. అయితే ఇప్పుడు సోమశిల, సాగర్ ట్రిప్ ఆలోటును తీర్చనుంది. సుమారు ఆరుగంటల సమయం బాహ్య ప్రపంచానికి దూరంగా ప్రకృతి ఒడిలో హాయిగా సేదతీరుతారు ఇక్కడ. పర్యాటకులు తక్కువ ఖర్చు, తక్కువ సమయంలో ఎక్కువ ఆనందాన్ని అందిస్తోంది ఈ ట్రిప్. ఓ వైపు ఆహ్లాదం, మరో వైపు ఆధ్యాత్మికం మధ్య ఆద్యంతం సాగిపోతుంది. మనుషులు తప్ప పచ్చదనం కనుచుపు మేర అయినా కనిపించని మనకు ఈ బోట్ లో ప్రయాణిస్తుంటే కనుచూపు మేర మనుషులు కనిపించరు..అక్కడక్కడ విసిరేసినట్టు చేపలు పట్టేందుకు జాలర్లు మాత్రమే కనిపిస్తారు..

అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్న తెలంగాణా  టూరిజం

క్రూజ్ లో కూర్చుని ప్రయాణిస్తుంటే అసలు సమయమే తెలియదు. పచ్చని ప్రకృతితో మమేకమై అసలు ఈ లోకంలోకి రావడానికి కొంత సమయం పడుతుంది. మొత్తం ఈ జర్నీలో మనకు లింగమయ్య పెంట, మహంకాలమ్మ కోట, అమరగిరి ,చీమల దిబ్బ ,అక్కమహాదేవి గుహలు కనిపిస్తాయి. వీటి గురించి బోట్ లో ఉన్న వ్యక్తులు ఆ స్పాట్ రాగానే దాని గురించి పర్యాటకులకు వివరిస్తారు. మొత్తం 10 మంది బృందం పర్యాటకులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుస్తారు. బోట్ కెప్టెన్ తిరుపతి తో పాటు అసిస్టెంట్ కెప్టెన్ ఇతర సిబ్బంది అత్యంత జాగ్రత్తతో క్రూజ్ ను ముందుకు తీసుకెళ్తారు.

కుడి వైపు ఆంధ్ర, ఎడమవైపు తెలంగాణా

ప్రయాణంలో ప్రతి ఒక్కరికి ఒక విచిత్ర అనుభవం ఎదురవుతుంది అదేంటంటే బోట్ ముందుకు వెళ్తుంటే ఎడమవైపు తెలంగాణా, కుడివైపు ఆంధ్ర ప్రాంతం అడవులు మనకు కనిపిస్తాయి. ఆ ప్రాంతం మొత్తం రిజర్వ్ ఫారెస్ట్ ఏరియా తో పాటు అతిపెద్ద టైగర్ జోన్ గా గుర్తించారు.ఈ బోట్ లో ప్రయాణించే ప్రతి ఒక్కరు భద్రత రీత్యా లైఫ్ జాకెట్లు ఖచ్చితంగా వేసుకోవాల్సిందే. టూరిస్టుల భద్రతతో పాటు వాళ్లకు ఫన్ గేమ్స్ లాంటివి బోట్ లో ఉంటాయంటున్నారు పర్యాటక శాఖ ఏజిఎమ్ ఇబ్రహీం

మంచి రుచికరమైన భోజనం ఏర్పాట్లు

మధ్యాహ్నం అయ్యే సరికి కడుపులో ఆకలి మొదలవుతుంది. మధ్యాహ్నం లంచ్ ఏర్పాట్లను టూరిజం శాఖ చేస్తుంది.. ఓ వైపు జలజలా పారే కృష్ణమ్మ మరోవైపు వేడివేడి పప్పు, సాంబర్ అన్నంతో లంచ్ వాహ్ అనేలా చేస్తుంది. కృష్ణమ్మ ఒడిలో కదులుతున్న బోట్ లో లంచ్ ఓ గొప్ప ఎక్పీరియన్స్. ప్లాస్టిక్ ను నీటిలో వెయ్యకుండా వేస్టేజి కోసం ప్రత్యేకంగా బ్యాగులు ఏర్పాటు చేస్తారు పర్యాటకులు అందులోనే వీటిని వెయ్యాలని సిబ్బంది సూచిస్తారు..ఇందులో ప్రయాణించే వారైతే ఎప్పుడు ఎక్కడా పొందలేని అనుభూతిని ఈ ప్రయాణంలో పొందుతారు.. కూసింత కళా పోషణ ఉన్న వారినే కాదు ఎలాంటి ఆసక్తి లేని మనసులను సైతం గిలిగింతలు పెడుతుంది ఈ పయనం. చిన్నా పెద్దా ఇలా ప్రతి ఒక్కరు ఎంజాయ్ చెయ్యొచ్చంటున్నారు పర్యాటకులు.. ఈ ప్రయాణం మరవలేని స్మృతులను మిగులుస్తోందని వారు స్పష్టం చేస్తున్నారు….

చుట్టు అడవి అక్కడక్కడ ఇళ్లు

ప్రయాణంలో ప్రతి ఒక్కరిని ఆకట్టుకునేది మాత్రం పచ్చదనం, మధ్య మధ్యలో కనిపించే పెద్ద పెద్ద కొండలు.. ఓ వైపు పరవళ్ళు తొక్కుతున్న కృష్ణమ్మ మరోవైపు పచ్చదనం రంగు వేసుకున్నట్టు ఉండే ప్రకృతి మనసుని ఆహ్లాదంగా మారుస్తాయి… ఇక్కడ ప్రత్యేక ఆకర్షణగా నిలిచేది మాత్రం ఎత్తైన కొండలే. ప్రకృతికి సాక్ష్యాలుగా నిలిచే విధంగా ఉండే ఈ కొండలు స్వయానా బ్రహ్మే భువికి దిగి వచ్చి ఈ ప్రాంతాన్ని మలిచాడా అనేంత అపురూపంగా ఉంటాయి.. వాతావరణం కూడా అప్పటికప్పుడు మారుతు పర్యాటకులను కనువిందు చేస్తుంది.. మధ్యమధ్యలో అక్కడక్కడ జలపాతాలు ఉంటాయి. వర్షాకాలంలో అయితే అత్యంత సుందరంగా ఇవి కనిపిస్తాయి ప్రస్తుతం వర్షాలు లేకపోవడంతో పెద్దగా ఈ జలపాతం మనకు కనినపించదు. ఆక్టోపస్ రూపంలో ఉన్న కొండ అందరిని ఆకర్షిస్తుంది.. కొన్ని చోట్ల కొండలను చీల్చుకుంటు ముందుకు వెళ్తున్నామా అనేలా ఉంటుంది ఈ జర్నీ. ప్రయాణం మధ్యలో ఎక్కడో మూలకు విసిరేసినట్టు కొంత మంది చిన్న గుడిసెలు వేసుకుని నివసించే దృశ్యం వారి ప్రశాంత జీవనానికి అద్దం పడుతుంది.. మరి వీరు ఈ అడవులలో ఏం చేస్తారనుకుంటారా.. చేపలు పట్టడం వీరి ప్రధాన జీవనాధారం… తెప్పల్లో ప్రయాణిస్తు చేపలు పడుతుంటారు.. ఇవన్నీ దాటుకుంటూ ఈ ప్రకృతి అందాలను చూస్తు ఉండగానే ఇట్టే 6గంటలు గడిచిపోయి శ్రీశైలం డ్యామ్ కు చేరుకుంటుంది..

 

వచ్చే  నెల నుంచి రోడ్ కమ్ రివర్ ప్యాకెజి

బోటు శ్రీశైలానికి చేరుకోగానే డ్యాం హుందాగా పలుకరిస్తూ ఉంటుంది. సాధారణంగా రోడ్ కమ్ రివర్ ప్లాన్ లో సాగర్ డ్యాం వద్దకు చేరుకోగానే అక్కడి నుంచి వచ్చే వారిని శ్రీశైలం వరకు బస్సులో తీసుకెళ్తారు. సోమశిల నుంచి వచ్చే వారిని రో వే ద్వారా శ్రీశైలం వద్దకు తీసుకెళ్తారు. అక్కడే రూం లు ఏర్పాటు చేస్తారు. ఆ తర్వాత రోజు సాక్షి గణపతి, పాలదార పంచదార దర్శనాల తర్వాత ఆమ్రబాద్ ఫారెస్ట్ ఏరియా చూసుకుని హైదరబాద్ కు చేరుకుంటారు. అయితే ప్రస్తుతం టూరిజం శాఖ ప్రకటించిన ఈ ప్లాన్ లో ఇది లేదు కాబట్టి ఇక్కడ నుంచి పర్యాటకులే ప్రత్యామ్నాయం చూసుకోవాలి. ఒకవేళ రిటర్న్ క్రూజ్ లో వెల్లాలి అనుకునే వారు మర్నాడు ఉదయం స్పాట్ కు చేరుకుని క్రూజ్ ఎక్కాల్సి ఉంటుంది. శ్రీశైలం చేరుకోగానే అప్పటివరకు కేరింతలు కొట్టే గుండెలు ఒక్కసారిగా ఆధ్యాత్మికతతో నిండిపోతాయి.