AI GLASSES FOR BLIND PEOPLE- అంధుల కోసం ఏఐ కళ్ళద్దాలు

అంధుల కోసం ప్రత్యేక పరికరం

అంధుల జీవితాల్లో కొత్త వెలుగు రాబోతోంది. వాళ్ళ ఇబ్బందులను తొలగించేందుకు ఏఐ ఆధారిత స్మార్ట్ కళ్ళద్దాలు అందుబాటులోకి వచ్చాయి. వీటి వల్ల మరింత కాన్పిడెంట్ గా పనులు చేసుకునే అవకాశం ఉంటుంది. ఏఐ ఆధారిత స్మార్ట్ కళ్లద్దాలు వారికి మరింత ఉపయోగకరంగా మారనున్నాయి.. ఇంతకీ ఏఐ ఆధారిత కళ్లద్దాలు ఏంటి ఇవి అంధులకు ఏ విధంగా ఉపయోగపడతాయి ఈ స్టోరి లో తెలుసుకుందాం..

అంధుల ఇబ్బందులు

అంధులు సమాజంలో అనేక సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు..దేశంలో దాదాపు 2 కోట్ల మంది ఉంటారు. ముఖ్యంగా తమ గమ్యస్థానాలకు చేరుకునే సమయంలో, ఎవరితో అయినా మాట్లాడాలన్నా ఏదైన చదవాలన్నా వీరి బాధలు వర్ణనాతీతం.. ఇక చేతికర్ర సహాయంతో ముందుకు సాగే వీరికి ఈ క్రమంలో అనేక ఇబ్బందులు ఎదురవుతాయి.. అయితే వీరి సమస్యకు చెక్ పెట్టేందుకు కొత్తగా ఏఐ ఆధారిత స్మార్ట్ కళ్లద్దాలు అందుబాటులోకి వచ్చాయి… కిమ్స్ ఫౌండేషన్, రీసెర్చ్ సెంటర్, అచల హెల్త్ సర్వీసెస్ ఆధ్వర్యంలో వీటిని తయారు చేశారు.

ఈ కళ్లద్దాల ఉపయోగం ఏంటి

ఏఐ కళ్ళద్దాలను వినియోగించేందుకు స్మార్ట్ మొబైల్ ఫోన్ ఉండాలి. కళ్ళద్దాలకి కెమెరాతో పాటు వైర్ లెస్ డివైస్ ఉంటుంది. దానిద్వారా సిగ్నల్ ను తీసుకుని స్పీచ్ రూపంలో అందిస్తుంది. పరిసరాలను, ముఖాలను గుర్తించడంలో, సైన్ బోర్డులు గుర్తుపట్టడం తో పాటు ఇండోర్ లో నావిగేషన్ సౌలభ్యాన్ని అందిస్తోంది ఈ పరికరంఎదురుగా ఉన్న వ్యక్తుల ముఖాలను గుర్తించడం వ‌ల్ల వారితో ధైర్యంగా మాట్లాడేందుకు వీలుంటుంది. దారిలో ఎదుర‌య్యే వ‌స్తువులు, అడ్డంకులు, ప‌రిస‌రాల‌ను గుర్తించ‌డం వ‌ల్ల అంధులు న‌డిచేట‌ప్పుడు ఇబ్బందులు లేకుండా ఉంటాయి. ఏదైనా రాసి ఉన్నా, ప్రింట్ చేసి ఉన్నా దాన్ని ఈ క‌ళ్ల‌ద్దాలే చ‌దివి వినిపిస్తాయి. దానివ‌ల్ల చ‌ద‌వ‌డం, క‌మ్యూనికేష‌న్ వీరికి మ‌రింత సుల‌భం అవుతుంది. ఎక్క‌డికైనా వెళ్లాల‌నుకుంటే అందుకు దారిని కూడా ఇవి చెబుతాయి. ఊదహారణకు పని చేసే కార్యాలయాలు, నివసించే ఇంటిలో పార్కింగ్ దగ్గర నుండి తమ స్థానానికి చేరుకోవడానికి సహాయం చేస్తాయి.

ధర ఎంత ఎలా పేరు నమోదు చేసుకోవాలి..

ప్రస్తుతం 100 మందికి ఉచితంగా అందించగా రాబోయే రోజుల్లో మరొక 500 ఉచితంగా అందించినట్టు కిమ్స్ సిఎండి భాస్కరరావు తెలిపారు.. దీని ధర పదివేల రూపాయలు. అచల సంస్థ లేదా కిమ్స్ వద్దకు వెళ్ళి పేర్లు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది.

ఎలా పనిచేస్తాయి..

ఏఐ ఆధారిత స్మార్ట్ కళ్లద్దాలలో అత్యాధునిక కంప్యూటర్ విజన్, మెషీన్ లెర్నింగ్ ఆల్లరిథమ్స్ ఉపయోగించారు. ఇవి అంధులకు అసాధారణ సేవలు అందిస్తాయి. వీటిని ఆపరేట్ చేయడం లేదా ఏదైనా సమస్య తలెత్తినప్పుడు అచల హెల్త్ సర్వీసెస్ కు సంబంధించిన టీం అందుబాటులో ఉండనుంది.. ప్రస్తుతం ఇంగ్లీష్, హిందీ, తెలుగు భాషల ద్వారా అంధులు సమాచారం తెలుసుకునే సాలభ్యం ఉంది..

అంధుల‌కు మ‌రింత ఆత్మ‌విశ్వాసం: డాక్ట‌ర్ భాస్క‌ర‌రావు

ఈ సంద‌ర్భంగా కిమ్స్ గ్రూప్ ఆఫ్ హాస్పిట‌ల్స్ సీఎండీ డాక్ట‌ర్ బొల్లినేని భాస్క‌ర‌రావు మాట్లాడుతూ, “మా కిమ్స్ ఫౌండేష‌న్‌, రీసెర్చ్ సెంట‌ర్ రూపొందించిన ఏఐ ఆధారిత స్మార్ట్ క‌ళ్ల‌ద్దాల‌ను ఆవిష్క‌రించేందుకు ఎంతో పెద్ద‌మ‌న‌సుతో ముందుకొచ్చిన గ‌వ‌ర్న‌ర్ జిష్ణుదేవ్ వ‌ర్మ‌కు ధ‌న్యవాదాలు. ఈ టెక్నాల‌జీ వ‌ల్ల అంధులు మ‌రింత సుల‌భంగా త‌మ చుట్టుప‌క్క‌ల ప్రాంతాల్లో తిర‌గ‌గ‌ల‌రు, ఎదురుగా ఉన్న‌వారిని గుర్తించి మాట్లాడ‌గ‌ల‌రు, దానివ‌ల్ల వారికి జీవితంలో మ‌రింత స్వేచ్ఛ‌, ఆత్మ‌విశ్వాసం ల‌భిస్తాయి. అంద‌రికీ సమాన అవ‌కాశాలు, అందుబాటులో స‌మాచారం ఉండే భ‌విష్య‌త్తు కోస‌మే మేం క‌ల‌లుగ‌న్నాం. అవి ఈరోజు నిజ‌మ‌య్యాయి” అని చెప్పారు.

అంద‌రి సాయంతో పంపిణీ

ప్రముఖ స్వ‌చ్ఛంద సంస్థ‌లు, ప్ర‌భుత్వ సంస్థ‌లు, వైద్య‌సేవ‌ల సంస్థ‌ల సాయంతో ఈ స్మార్ట్ క‌ళ్ల‌ద్దాల‌ను అవ‌స‌ర‌మైన అంధుల‌కు పంపిణీ చేయిస్తామ‌ని కేఎఫ్ఆర్‌సీ ఛైర్మ‌న్ డాక్ట‌ర్ వి.భుజంగ‌రావు తెలిపారు. క‌ళ్ల‌ద్దాలు ఇవ్వ‌డంతో పాటు, వాటిని ఎలా వాడాల‌న్న అంశంపై శిక్ష‌ణ కూడా తామే అందిస్తామ‌ని ఆయ‌న వివ‌రించారు. గ‌తంలో కూడా తాము దేశంలోనే తొలిసారిగా బ‌ధిరులు, అంధుల కోసం ఉచిత టెలిమెడిసిన్ సెంట‌ర్‌ను నెల‌కొల్పామ‌ని డాక్ట‌ర్ భుజంగ‌రావు గుర్తుచేశారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *