అసెంబ్లీ సమావేశాలకు కెసిఆర్-kcr will attend to assembly meeting

 

అసెంబ్లీ  సమావేశాలు

తెలంగాణా బడ్జెట్ సమావేశాలు 2025 ప్రారంభం కానున్నాయి. మార్చి 9 నుంచి ప్రారంభం కానున్నాయి. ప్రతి ఒక్కరు బడ్జెట్ సమావేశాల కన్నా ఒకే అంశం ఎక్కువ ఆసక్తిని రేపుతోంది అదే మాజీ సిఎం కెసిఆర్ సమావేశాలకు అటెండ్ అవుతారా అని. పోయిన బడ్జెట్ సమావేశాలకు ఒక్కరోజు హాజరైన కేసీఆర్ ఆ తర్వాత అసెంబ్లీ వైపే రాలేదు. దీంతో అందరి దృష్టి మాజీ ముఖ్యమంత్రిపైనే ఉంది..

కనిపించని మాస్ లీడర్

2023 అసెంబ్లీ ఎన్నికల్లో  ఓటమి తర్వాత కేసీఆర్ అడపా దడపా తప్ప పెద్దగా ప్రజల్లోకి రావడం లేదు.  మీటింగ్ అయిన, రాజకీయ చర్చలైన ఫామ్ హౌస్ లోనే నిర్వహిస్తున్నారు. గత ఏడాదిన్నర కాలంగా మూడుసార్లు మాత్రమే తెలంగాణ భవన్లో సమావేశాలు నిర్వహించారు. గతంలొ తెలంగాణ భవన్లో నిర్వహించిన సమావేశాల్లో ఇకపై నేను అందుబాటులో ఉంటానంటూ ప్రకటించాడు. 25 ఏళ్ల పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్ గా చేయాలని కేడర్ కు సూచించారు. ఆ తర్వాత మళ్లీ యధావిధిగా కార్యక్రమాలన్నీ ఫామ్ హౌస్ నుంచే నడుస్తున్నాయి.

 

ప్రతి పక్షాల విమర్శలు

ప్రజా సమస్యలను చర్చించాల్సిన అసెంబ్లీకి రాకపోవడంతో పాటు ప్రజాసమస్యలకు దూరంగా ఉన్నారంటు కాంగ్రెస్, బిజెపిలు విమర్శిస్తున్నాయి.కెసిఆర్ కు దమ్ముంటే అసెంబ్లీకి వచ్చి ప్రజాసమస్యలపై చర్చించాలని సవాల్ విసురుతున్నారు. కేవలం అధికారంలో ఉంటే మాత్రమే ప్రజల వైపు , అసెంబ్లీ వైపు చూస్తారా అంటు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు.  ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఫామ్ హౌస్ లో సెటిల్ అవ్వాలంటు సెటైర్లు వేస్తున్నారు. దీంతో బిఆర్ ఎస్ పార్టీకీ ప్రజల్లో కూడా ఇబ్బందులు ఎదురవుతోందంటు కిందిస్థాయి క్యాడర్ తర్జనభర్జన పడుతోంది..

అసెంబ్లీ సమావేశాల్లో స్పెషల్ అట్రాక్షన్

గత బడ్జెట్ సమావేశాల్లో బడ్జెట్ ప్రవేశపెట్టిన రోజు మాత్రమే కెసిఆర్ అసెంబ్లీకి వచ్చారు. బడ్జెట్ తర్వాత మీడియా పాయింట్ వద్ద మీడియాతో మాట్లాడి వెళ్లిపోయారు. ఒకరోజు అసెంబ్లీకి వచ్చి మొహం చాటేసారని అధికార పార్టీ ఆరోపించింది. ఈ సారి మాత్రం గులాబి బాస్ అసెంబ్లీకి ఖచ్చతింగా వస్తారని అంటున్నారు గులాబి దండు. బడ్జెట్ సమావేశాలకు హాజరై బడ్జెట్ పైన ప్రసంగం కూడా చేయాలని కెసిఆర్ భావిస్తున్నట్లు తెలుస్తుంది. పూర్తిగా అసెంబ్లీకి దూరమవడం వల్ల ప్రజల్లో కొంత వ్యతిరేకత వ్యక్తం అయ్యే అవకాశం ఉంటుందని కెసిఆర్ గుర్తించినట్టు చెబుతున్నారు. అసెంబ్లీ వేదికగా ప్రభుత్వ వైఖరిపై గళం విప్పాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది.. అయితే గత 10 ఏళ్ళ కాలంలో జరిగిన అవినీతిని బయటపెట్టి కెసిఆర్ ను ఇబ్బంది పెట్టాలని  చూస్తోంది కాంగ్రెస్ పార్టీ.. పార్టీలో భిన్నాభిప్రాయాలు ఉన్న కేసీఆర్ మాత్రం సమావేశాలకు హాజరు అవ్వాలని నిర్ణయించుకున్నారు. లాంగ్ గ్యాప్ తర్వాత అసెంబ్లీలో కేసీఆర్ స్పీచ్ పై ఇంట్రెస్ట్ పెరుగుతుంది.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *